Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైన్యం తిరుగుబాటుతో సూడాన్‌లో ఎమర్జెన్సీ

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (10:31 IST)
సూడాన్‌లో సైన్యం తిరుగుబాటు చేసింది. దీంతో ఆ దేశంలో ఎమర్జెన్సీని విధించారు. తాత్కాలిక ప్రధాని అబ్దుల్లా సహా పలువురు అధికారులను రహస్య నిర్బంధం విధించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే సూడాన్‌లో ఆర్మీ జనరల్‌ అబ్దెల్‌ ఫతాహ్‌ బుర్హాన్‌ అత్యవసర అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా దేశ అధికార మండలితో పాటు ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేశారు. సైన్యం తిరుగుబాటు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ క్రమంలో నిరసనకారులను అదుపు చేసేందుకు సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు మృతి చెందగా, 140 మంది వరకు గాయపడ్డారు. 
 
మొత్తం ఘర్షణల్లో ఏడుగురు మృతి చెందారని, 140 మంది వరకు గాయపడ్డారని ఆరోగ్య అధికారులు తెలిపారు. రెండేళ్ల క్రితమే ఒమర్​ అల్​ బషీర్​ సుదీర్ఘ పాలన నుంచి బయటపడి ప్రజాస్వామ్యం వైపు సుడాన్ అడుగులు వేస్తోంది​. ఈ తరుణంలో సైనిక తిరుగుబాటు జరగడం ఆ దేశానికి ప్రతికూలంగా మారనుంది.
 
సైనికాధికారులు తిరుగుబాటుకు సెప్టెంబర్​లోనే ప్రయత్నించినా అది విఫలమైంది. అప్పటి నుంచి సుడాన్​ రాజకీయ నేతలు, మిలిటరీ అధికారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఆ దేశం సైనిక పాలనలోకి జారుకుంది. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపట్టాలని దేశంలోని ప్రజాస్వామ్య పార్టీలు పిలుపునిచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments