Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో చూసిన బంధువులు, అంతే...

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (21:17 IST)
పెళ్ళయ్యింది. పిల్లలు లేరు. డబ్బులు సంపాదించడానికి భర్త విదేశాలకు వెళ్ళిపోయాడు. ఒంటరితనం. బాగా చదువుకోవడంతో ఉద్యోగంలోకి వెళ్ళింది. అక్కడే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే తన విషయాన్ని బయటకు రాకుండా ఎన్నోరోజులు జాగ్రత్తపడ్డ వివాహిత ఉన్నట్లుండి బయటపడటంతో ఆత్మహత్యకు పాల్పడింది.
 
కేరళ రాష్ట్రం అలపుజకు చెందిన సతీష్ అనే 28 యేళ్ళ వ్యక్తికి, సవిత అనే యువతికి రెండేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. విదేశాల్లో ఉద్యోగం దొరకడంతో తన ఇంటిలోనే సవితను వదిలి వెళ్ళాడు సతీష్. ఇంతవరకు ఇండియాకు రాలేదు. అయితే ఇంట్లో బోర్ కొడుతుందని ఒక సూపర్ మార్కెట్లో ఉద్యోగంలో చేరింది సవిత.
 
అక్కడే మేనేజర్‌గా విధులను నిర్వర్తిస్తోంది. మరో మేనేజర్ ప్రవీణ్ కూడా సవితతో పాటు కొత్తగా ఉద్యోగంలో చేరాడు. మేనేజర్లు కావడంతో ఇద్దరి మధ్యా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. డ్యూటీకి వచ్చినప్పుడు సైలెంట్‌గా ఉండే వీళ్ళు డ్యూటీ అయిపోయిన తరువాత భార్యాభర్తల్లాగా బయట తిరుగుతూ తెగ ఎంజాయ్ చేసేవారు. తన ఇంట్లో వారికి తెలియకుండా జాగ్రత్తగా పడింది సవిత. 
 
అయితే రెండురోజుల క్రితం ఆదివారం కావడంతో ప్రియుడిని కలుసుకునేందుకు బయటకు వచ్చింది. సాయంత్రం వరకు ప్రియుడితో తిరిగి ఆ తరువాత ఇంటికి రావడానికి సిద్ధమైంది. అయితే సతీష్ బంధువులు సవితను ప్రవీణ్‌తో చూశారు. ఈ విషయాన్ని గమనించిన సవిత ఆందోళనకు గురైంది. 
 
తన భర్తకు విషయం ఎక్కడ తెలిసిపోతుందన్న భయంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమేంటో కూడా లేఖలో రాసింది. తన భర్తకు క్షమాపణ చెబుతూ లేఖలో కూడా రాసింది సవిత.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments