Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి లోపు ఒక్క మావోయిస్టు ఉండటానికి వీల్లేదు : అమిత్ షా

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (10:46 IST)
ప్రగతి విఘాతకులుగా ముద్రపడిన మావోయిస్టులను పూర్తిగా ఏరివేసే పనిలో కేంద్రం నిమగ్నమైంది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిశితంగా దృష్టిసారించారు. ఇందులోభాగంగా, వచ్చ యేడాది వేసవి లోపు దేశంలో ఒక్క మావోయిస్టు కూడా లేకుండా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, మావోయిస్టుల అంతానికి దేశంలో చేపడుతున్న ఆపరేషన్లపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 'సమస్య ఏంటి.. ఎక్కడ, ఎందుకు ఉంది' అని గత నెలలో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులను ప్రశ్నించారు. 
 
సమస్య కేంద్ర భద్రతా దళాలైన 'కోబ్రా' నుంచి ఉందా? రాష్ట్ర దళాల నుంచి ఉందా? అనే విషయంపై లోతైన విచారణ జరపాలని ఆదేశించారు. వచ్చే ఏడాది వేసవిలోపు బిహార్‌, జార్ఖండ్‌, మహారాష్ట్రలో మావోయిస్టులు లేకుండా చేయాలని స్పష్టమైన టార్గెట్‌ ఇచ్చారని ఓ సీఆర్‌పీఎఫ్‌ అధికారి తెలిపారు. 
 
దీంతో వచ్చే ఏడాది జూన్‌లోపు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా 'ప్రహార్‌-3'ను భద్రతా దళాలు ప్రకటించాయి. మరోవైపు నక్సలైట్ల ఏరివేతకు కేంద్ర, రాష్ట్ర భద్రతాదళాలు కలిసి పనిచేయాలని అమిత్‌ షా ఆదేశించారు. హెలికాప్టర్లు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి కోసం కోట్లాది రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments