ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నీచుడు, సభ్యతలేనివాడంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశంలో ప్రకంపనలు రేపుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నీచుడు, సభ్యతలేనివాడంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ యువ అధినేత రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలపై మండిపడటమే కాకుండా, మణిశంకర్ అయ్యర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు.
తాజాగా ఎస్పీ మార్గదర్శకుడు ములాయం సింగ్ కూడా స్పందించారు. మణి శంకర్ అయ్యర్‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై నీచ వ్యాఖ్యలు చేసినందుకు అయ్యర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రధాని మోడీని ఉద్దేశించి 'నీచుడు' అనే పదాన్ని ఉపయోగించడం ఖచ్చితంగా తప్పేనని తెలిపారు. అటువంటి మాటలు మాట్లాడిన నేతను కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సరిపోదని, పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు.