Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైరా వసీమ్‌కు లైంగిక వేధింపులు : కేంద్రం సీరియస్

బాలీవుడ్ మూవీ "దంగల్" చిత్రంలో నటించిన నటి జైరా వసీమ్‌కు విమానంలో ఎదురైన లైంగిక వేధింపులపై కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. అలాగే జాతీయ మహిళా సంఘం కూడా సీరియస్‌గా స్పందించింది.

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2017 (13:59 IST)
బాలీవుడ్ మూవీ "దంగల్" చిత్రంలో నటించిన నటి జైరా వసీమ్‌కు విమానంలో ఎదురైన లైంగిక వేధింపులపై కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. అలాగే జాతీయ మహిళా సంఘం కూడా సీరియస్‌గా స్పందించింది. 
 
ఢిల్లీ నుంచి ముంబైకి విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో వసీమ్ వస్తుండగా.. తన వెనుక సీట్లో కూర్చొన్న సహచర ప్రయాణికుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను జైరా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. దీనిపై విస్తారా యాజమానాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ వివరణ కోరింది. ముంబైలో వసీమ్ బస చేస్తున్న హోటల్‌కి వెళ్లిన పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. 
 
వసీమ్‌పై సహచర ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించడం పట్ల జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్రస్థాయిలో స్పందించింది. జైరా వసీమ్‌ను వేధించిన వ్యక్తిపై విస్తారా సిబ్బంది చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి విస్తారాకు నోటీసులు ఇస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం