Man: ఢిల్లీ పట్టపగలే బంగారం దోపిడీ.. కోటి రూపాయలు గోవిందా

సెల్వి
గురువారం, 25 సెప్టెంబరు 2025 (10:59 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. పట్టపగలు నడిరోడ్డుపై ఇద్దరు వ్యక్తులు బంగారు ఆభరణాలను
gold
షాపులో ఇచ్చేందుకు వెళ్తుండగా దారి కాచి మరీ వాటిని దోచేశారు దోపిడీ దొంగలు. దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే ఈ  దోపిడీ జరగడం కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత్‌ మండపం సమీపంలో కొందరు దొంగలు దారికాచి రూ. కోటి విలువ చేసే నగలను దోచుకెళ్లడం సంచలనంగా మారింది. 
 
ఢిల్లీకి చెందిన శివమ్‌కుమార్‌ యాదవ్‌, రాఘవ్‌ బంగారు ఆభరణాలను తయారు చేసి అవసరమైన షాపులకు సరాఫరా చేస్తుంటారు. ఎప్పటిలాగే నగలున్న బ్యాగులను తీసుకుని వారు తమ స్కూటర్‌పై చాందినీ చౌక్‌ నుంచి భైరాన్‌ మందిర్‌కు బయల్దేరినట్లు తెలిసింది. 
 
సమీపంలోని నగల దుకాణంలో వీటిని ఇచ్చేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు దుండుగులు బైక్‌పై వచ్చి వారిని అడ్డుకున్నారు. వెంటనే తేరుకున్న బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇచ్చారు. వారి సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుల కోసం వారు గాలింపు చేపట్టారు. కాగా బాధితుల నుంచి 500 గ్రాముల బంగారం, దాదాపు 35 కిలోల వెండి ఆభరణాలను దుండగులు దోచుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. మార్కెట్‌లో వీటి విలువ రూ.కోటి పైనే ఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

Suman: రెగ్యులర్ షూటింగ్ లో ఉదయ భాస్కర వాగ్దేవి డైరెక్టన్ లో మహానాగ

రిషికేష్‌కు రజినీకాంత్, రోడ్డు పక్కన రాతి బెంచీపై ప్లేటులో భోజనం చేస్తూ...

Raviteja: రవితేజ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ ప్రోమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments