Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమైందో ఏమో భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్నాడు...

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (12:57 IST)
భార్యాభర్తల అనుబంధం, ఆప్యాయత ప్రస్తుత కాలంలో కనుమరుగు అవుతోంది. కష్టసుఖాలను కలిసి పంచుకుంటామని ఏడడుగులు వేశారు. ఎన్నో ఆశలతో దాంపత్య జీవితం మొదలు పెట్టారు. అంతలోనే ఏమైందో ఏమో.. భార్యను దారుణంగా హత్యచేసి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లాలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లాలోని సొడక్‌ గ్రామంలో బిపిన్‌, లలికి ఈ ఏడాది మే 24 న వివాహం జరిగింది. బిపిన్ కూలీపనులకు వెళ్తుంటాడు.
 
కొద్దీ రోజులుగా దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏం జరిగిందో ఏమో.. భార్యను గొడ్డలితో నరికేసి.. అనంతరం అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం బిపిన్ తండ్రి ఇంట్లోకి వచ్చి చూడగా ఇద్దరు విగత జీవులుగా పడివున్నారు. 
 
దీంతో అతడు పోలీసులకు, లలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments