Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం.. భార్య గొంతు కోసి చంపేశాడు..

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (19:55 IST)
వివాహేతర సంబంధం కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతోంది. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త ఆమెను కిరాతకంగా హత్య చేసాడు. జనవరి 4వ తేదీన చావ్లా తేజ్ పూర్ రోడ్డు పక్కన ఉన్న పొదల్లో ఓమహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను గొంతుకోసి కిరాతకంగా హత్య చేసినట్లు గుర్తించారు. విచారణలో వాయువ్య ఢిల్లీలోని బల్జీత్ విహార్ ప్రాంతంలో ఓ మహిళ మిస్సింగ్ కేసు నమోదైనట్లు తెలుసుకున్నారు. 
 
అదృశ్యమైన మహిళ వివరాలు తమకు లభ్యమైన మహిళ మృతదేహం ఆనవాళ్లు సరిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మిస్సింగ్ మహిళ గురించి ఫిర్యాదు చేసిన బల్జీత్ విహార్‌ని వ్యక్తి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె కుమారుడు శివంను ఆస్పత్రికి తీసుకువెళ్లి తమకు దొరికిన మృతదేహాన్ని చూపించారు. ఆమె తన తల్లి సరస్వతిగా శివం చెప్పాడు. తల్లి శవం చూసి శివం భోరున విలపించాడు. అయితే భర్త సోహన్ కనిపించక పోవటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు అతడి గురించి గాలింపు చేపట్టారు. సోహన్ చౌరాసియా ను మంగళవారం నిహారీ రోడ్డులో అరెస్ట్ చేశారు. భార్యను తానే హత్య చేసినట్లు సోహన్ ఒప్పుకున్నాడు.
 
తమ ఇంట్లో రెండేళ్లుగా కలిసి జీవిస్తున్న చందన్ అనే వ్యక్తితో భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో హత్య చేసినట్లు అంగీకిరించాడు. భార్య మెడను ప్లాస్టిక్ తాడు బిగించి ఊపిరాడకుండా చేశానని.. ఆపై పదునైన కత్తితో మెడకోసి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తేజ్ పూర్ చావ్లా రోడ్డు పక్కన పొదల్లో పడేసి పారిపోయినట్లు వివరించాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments