Webdunia - Bharat's app for daily news and videos

Install App

దృశ్యం సినీ ఫక్కీలో ప్రియురాలిని హత్యచేసి.. ఇంట్లోనే దాచిపెట్టాడు..

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (14:48 IST)
దృశ్యం సినీ ఫక్కీలో తన ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని తన ఇంట్లోనే దాచిపెట్టాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ ఘర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సూరజ్ అనే వ్యక్తికి అమిత మొహితే అనే యువతితో ఆరేళ్ల క్రితం పరిచయం ఉంది. వీరిద్దరూ ప్రేమలో వున్నారు. ఈ క్రమంలోనే వీరి రిలేషన్‌కు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గత ఏడాది అక్టోబర్ నెలలో వీరి వివాహం నిశ్చయమైంది.
 
ఈ క్రమంలోనే అక్టోబరు 21వ తేదీన తన పెళ్లి కోసం ప్రియుడితో కలిసి షాపింగ్‌కి వెళ్తున్నాను అంటూ యువతిని ఇంట్లో చెప్పి వెళ్ళింది. ఇక ఆ తర్వాత ఎంతకీ యువతి మాత్రం ఇంటికి రాలేదు దీంతో కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేసిన ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో కంగారుపడి పోయిన యువతి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఇక అప్పటి నుంచి సూరజ్ పోలీసుల నుంచి తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. ఇటీవలే సదరు యువతి సోదరుడు సూరజ్‌ను గమనించి వెంబడించి పట్టుకున్నాడు. అనంతరం పోలీసులకు అప్పగించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఒప్పుకున్నాడు. 
 
యువతిని చంపి బిల్డింగులో యువతి మృతదేహాన్ని పెట్టి గోడ కట్టాను అంటూ చెప్పడంతో పోలీసులు సైతం షాకయ్యారు. ఈ ఘటనపై అన్నీ కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ప్రియురాలిని అంత క్రూరంగా చంపాల్సిన కారణాలపై విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments