Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ తెలంగాణ సీఎం అవుతారా? ఫిబ్రవరి 18న పట్టాభిషేకం..?

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (13:51 IST)
తెలంగాణ సీఎం పగ్గాలను ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేపట్టబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఎప్పుడెప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారని టీఆర్ఎస్ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అంతేగాకుండా టీఆర్ఎస్ సీనియర్ నేతలు కేటీఆర్ త్వరలో సీఎం అవుతారని చెప్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం రెండో ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి18న కేటీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం. ఈ మేరకు కేసీఆర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది.
 
ఈ మేరకు బ్రాహ్మణ పురోహితులు ముహూర్తం నిర్ణయించారని తెలిసింది. ఇంతలో కేసీఆర్ యాగాలు కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది. అయుత చండీ యాగంతో పాటు రాజశ్యామల యాగం కూడా సీఎం నిర్వహిస్తారని సమాచారం. ఆ యాగాలు పూర్తయిన తర్వాత కొడుకుకు పట్టాభిషేకం చేస్తారని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి.
 
కేటీఆర్ ప్రమాణ స్వీకారానికి ముందు లేదా తరువాత మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించనున్నారని తెలిసింది. పార్టీ అధినేతగా కేసీఆర్ కొనసాగనున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments