Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. ప్రియురాలి భర్తను అలా హత్య చేశాడు..

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (12:25 IST)
వివాహేతర సంబంధాల కారణంగా వివాహ వ్యవస్థపై వున్న నమ్మకం జనాలకు రోజు రోజుకీ తగ్గిపోతుంది. వివాహం అయినా అక్రమ సంబంధాలు నెరపే వారి  సంఖ్య పెరగడం తద్వారా నేరాల సంఖ్య కూడా పెరుగుతూ పోవడం ప్రస్తుతం సహజమైపోయింది. 
 
తాజాగా తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలు భర్తను ప్రియుడు హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కామాక్షికి చెందిన సెల్వరాజ్(35)కు వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతను ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
 
అయితే, తన భార్య మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్తను ప్రియుడు హతమార్చాడు.  
 
ఆటోకు నిప్పు పెట్టి సెల్వరాజ్‌ను బయటకు రప్పించి.. వెనుక నుంచి భార్య ప్రియుడితోపాటు నలుగురు వ్యక్తులు అతడి గొంతుకోసి హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments