తమిళనాడులో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సులోనే  పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు బస్సులో మద్యం సేవించారు. ఈ గ్రూపులోని ఓ విద్యార్థి ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. 
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఈ వీడియోలో విద్యార్థినీ, విద్యార్థులు కలిసి..ఓ బీర్ బాటిల్‌ను ఓపెన్ చేసి, తాగుతున్నట్లు  కనిపించింది. బస్సులో మద్యం సేవిస్తున్న సమయంలో వారంతా స్కూల్ యూనిఫామ్‌లోనే ఉన్నారు. 
	 
	వీరంతా చెంగల్‌పట్టులోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులని తెలుస్తోంది. ఇది కూడా పాత వీడియో అని సమాచారం. 
	 
	ఈ వీడియో వైరల్ కావడంతో జిల్లా విద్యాధికారి స్పందించారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లిందని, పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారని తెలిపారు.