Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టింటికెళ్లిన భార్య తిరిగిరాలేదనీ.. దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన భర్త!

తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్య కోసం ఆ భర్త అత్తారింటి చుట్టూ పలుమార్లు తిరిగాడు. అయినప్పటికీ.. భార్య మాత్రం కనికికరం చూపలేదు.

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (13:22 IST)
తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్య కోసం ఆ భర్త అత్తారింటి చుట్టూ పలుమార్లు తిరిగాడు. అయినప్పటికీ.. భార్య మాత్రం కనికికరం చూపలేదు. దీంతో ఏం చేయాలో తోచని ఆ భర్త... తన భార్య మనసు కరిగి ఇంటికి వచ్చేలా చూడమని దేవుడిని ప్రార్థించసాగాడు. అప్పటికీ ఫలితం లేకపోవడంతో విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం ఇండోర్‌లోని పల్డాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పల్డా ప్రాంతానికి చెందిన మనోజ్ బంజారా (37) అనే వ్యక్తి తన భార్యతో నాలుగు నెలల క్రితం గొడవ పడ్డాడు. దీంతో భర్తపై అలిగిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత నాలుగు నెలల నుంచి భార్యను తన ఇంటికి తీసుకువచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యాడు.
 
ఇక చేసేదేంలేక... తన భార్య ఇంటికి వచ్చేలా చూడాలని మనోజ్ ప్రతి రోజు దేవుడిని ప్రార్థిస్తూ వచ్చాడు. కొద్ది రోజుల నుంచి దేవుడిని ప్రార్థించినప్పటికీ ఫలితం లేదు. దీంతో ఆవేశానికిలోనైన మనోజ్ దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ కేసులో మనోజ్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments