Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆండ్రాయిడ్ ఫోన్లతో ముప్పెక్కువ.. లాలీపాప్ వెర్షన్‌కు మారండి!

ఆండ్రాయిడ్ మొబైళ్లను ఉపయోగిస్తున్నారా? భారత్‌లోని ఆండ్రాయిడ్‌ మొబైల్ యూజర్లకు కొత్త ముప్పొచ్చి పడిందని ట్రెండ్ మైక్రో అనే ఆన్‌లైన్ భద్రతా రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. గాడ్‌లెస్ అనే అత్యంత ప్రమాదకరమైన

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (13:15 IST)
ఆండ్రాయిడ్ మొబైళ్లను ఉపయోగిస్తున్నారా? భారత్‌లోని ఆండ్రాయిడ్‌ మొబైల్ యూజర్లకు కొత్త ముప్పొచ్చి పడిందని ట్రెండ్ మైక్రో అనే ఆన్‌లైన్ భద్రతా రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. గాడ్‌లెస్ అనే అత్యంత ప్రమాదకరమైన మాల్‌వేర్ ముంగిట భారతీయలున్నట్లు సదరు సంస్థ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 9 లక్షల వరకు ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు దీని బారిన పడ్డారని ఆ సంస్థ వెల్లడించింది.
 
ముఖ్యంగా ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 వెర్షన్‌ను ఉపయోగిస్తున్న వారు.. మరింత జాగ్రత్తపడాలని ఆ సంస్థ హెచ్చపిస్తోంది. ఈ మాల్ వేర్ ద్వారా హ్యాకర్లు తమ మన ఫోన్లను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని.. డేటానంతా తస్కరించి ఫోనును ఎందుకు పనికిరాకుండా మార్చేస్తారు.

భారత్ మాత్రమే కాకుండా థాయ్‌లాండ్, చైనా, జపాన్, ఇండోనేషియా వంటి ఆసియా దేశాలకు కూడా ఈ మాల్‌వేర్ ప్రమాదం ఉన్నప్పటికీ.. మనదేశానికి ఈ యూజర్ల ద్వారా ముప్పెక్కువని పరిశోధకులు వెల్లడించారు. అందుచేత ఆండ్రాయిడ్ ఉపయోగించడంలో జాగ్రత్త పడాలి. 
 
ఏదైనా గుర్తుతెలియని లింక్‌పై క్లిక్ చేయడం, ఏదైనా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోదలిస్తే గూగుల్ ప్లే స్టోర్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇంకా ఆండ్రాయిడ్ ఫోనుతో ముప్పు నుంచి తప్పించేందుకు లాలీపాప్ వెర్షన్ నుండి అత్యాధునిక మార్ష్‌మెల్లో వెర్షన్‌కు అప్‌డేట్ కావాలని ఐటీ నిపుణులు అంటున్నారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments