Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కపిల్ల కరిచిందనీ.. శునకం కాళ్లను రంపంతో కోసిన కిరాతకుడు

ఢిల్లీలో దారుణం జరిగింది. కుక్క కరిచిందనీ.. ఆ శునకం కాళ్ళను రంపంతో కోసిన ఘటన ఢిల్లీ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... రెండు నెలల వయసున్న కుక్కపిల్ల ఢిల్లీలోని ద్వారక

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (16:33 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. కుక్క కరిచిందనీ.. ఆ శునకం కాళ్ళను రంపంతో కోసిన ఘటన ఢిల్లీ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... రెండు నెలల వయసున్న కుక్కపిల్ల ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో నివశించే ప్రమోద్ అనే నిరుద్యోగి ఇంట్లోకి ప్రవేశించింది. నిత్యం మద్యం మత్తులో ఉండే ఆ వ్యక్తి కుక్కపిల్లను పిలిచి, దానికి కొంత ఆహారం కూడా వేశాడు. 
 
అయితే, ఆహారం తీసుకోవాలన్న తొందరలో.. ఆ కుక్కపిల్ల అతడి కాళ్లమీద తన ముందరి కాళ్లతో కొద్దిగా గీరడంతో పాటు.. కొరికింది. వెంటనే అతడికి కోపం వచ్చి, రంపం తీసుకుని దాన్ని ముందుగా కట్టేసి, ఒక ముందు కాలు, ఒక వెనక కాలు కోసేశాడని జంతువుల హక్కుల కార్యకర్త గౌరవ్ శర్మ ఆరోపించారు.
 
ప్రమోద్ ఇంటి సమీపంలో ఉండే ఓ బాలిక అతడి క్రూరత్వం గురించి తనకు ఫోన్ చేసి చెప్పడంతో విషయం తెలిసిందని గౌరవ్ అన్నారు. కుక్కపిల్లను రక్షించడానికి తాను అక్కడకు వెళ్లగా, ప్రమోద్ భార్య జరిగిన విషయం మొత్తాన్ని వివరించిందన్నారు. కొన్ని నెలల క్రితం ప్రమోద్ ఒక కోతిని ఇంటికి తీసుకొచ్చి, తర్వాత దాన్ని నరికేశాడని కూడా ఆమె ఆరోపించింది. అయితే ఆ విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే, ఈ నేరానికి అతడికి గరిష్ఠంగా 50 రూపాయల జరిమానా మాత్రమే పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments