Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన మెడకు తనే ఉచ్చు బిగించుకున్న 'గాలి'..? రూ.100 కోట్ల పాతనోట్లు పని పట్టాయ్...

గాలి జనార్థన్ రెడ్డి అంటే తెలియనివారు ఎవరూ ఉండరు. అక్రమ మైనింగ్ కేసులో చిక్కుకుని రెండేళ్ళకు పైగా జైలు జీవితం గడిపిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి మెడకు మరో ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తున

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (16:27 IST)
గాలి జనార్థన్ రెడ్డి అంటే తెలియనివారు ఎవరూ ఉండరు. అక్రమ మైనింగ్ కేసులో చిక్కుకుని రెండేళ్ళకు పైగా జైలు జీవితం గడిపిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి మెడకు మరో ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో పెద్ద నోట్ల చెలామణిపై నిషేధం విధించిన తర్వాత ఆయన కొందరు మధ్యవర్తుల సాయంతో రూ.100 కోట్ల పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చారు. ఈ విషయం రెవెన్యూ అధికారి కారు డ్రైవర్ ఆత్మహత్య లేఖలో బహిర్గతమైంది. 
 
నిజానికి.. ఇటీవల దేశం అబ్బురపడేలా గాలి జనార్ధన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మణికి అంగరంగ వైభంగా వివాహం జరిపించాడు. నోట్ల రద్దు తర్వాత కూడా గాలి జనార్ధన్‌రెడ్డి అన్ని కోట్లు ఖర్చు పెట్టి కూతురి పెళ్లి ఎలా చేయగలిగాడనే ప్రశ్న అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరికేలోపే గాలి జనార్దన్‌ రెడ్డి తన మెడకు తానే మరో ఉచ్చు బిగించుకున్నాడు. 
 
గాలి జనార్ధన్ రెడ్డి మధ్యవర్తుల సాయంతో పాతనోట్లు మారుస్తున్నట్లు తెలిసింది. నోట్ల మార్పిడి సమయంలో కొంత నగదు తక్కువగా వచ్చిందని ఈ నోట్ల మార్పిడికి సహకరించిన రెవెన్యూ అధికారి డ్రైవర్‌కు గాలి అనుచరుల నుంచి బెదిరింపులొచ్చాయి. దీంతో మనస్తాపంతో డ్రైవర్‌ రమేష్‌గౌడ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే రమేష్ గౌడ రాసిన సూసైడ్‌నోట్‌తో గాలి బాగోతం వెలుగులోకి వచ్చింది. బళ్లారిలో 20 శాతం కమీషన్‌తో 100 కోట్ల పాతనోట్లు మార్పిడి చేసినట్లు ఈ లేఖ ద్వారా తెలిసింది. ఈ నోట్ల మార్పిడిపై ఈడీ, ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments