Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

ఠాగూర్
బుధవారం, 23 జులై 2025 (17:39 IST)
మహారాష్ట్రలోని కళ్యాణ్ జిల్లాలో దారుణం జరిగింది. అపాయింట్మెంట్ లేకుండా వచ్చిన ఓ వ్యక్తిని వరుసక్రమం(క్యూ)లో రమ్మని చెప్పినందుకు ఓ మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని, జుట్టుపట్టిలాగి భౌతిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కళ్యాణ్ ప్రాంతానికి చెందిన బాధిత యువతి నందివాలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆమె విధుల్లో ఉండగా ఆస్పత్రికి కొంతమంది రోగులు వచ్చారు. అయితే, అప్పటికి డాక్టర్ రాకపోవడంతో వారిని వేచి వుండమని చెప్పింది. ఆలస్యంగా వచ్చిన ఆ డాక్టర్ ముందుగా మెడికల్ రిప్రజెంటేటివ్‌ను కలిసి మాట్లాడారు. 
 
అప్పటికే ఆయన కోసం వేచివున్న రోగులు దీనిపై రిసెప్షనిస్ట్‌ను నిలదీశారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన కుమారుడు చెకప్ కోసం ఆస్పత్రికి వచ్చాడు. అపాయింట్మెంట్ లేకుండానే డాక్టర్ క్యాబిన్‌ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అపుడు ఆ రిసెప్షనిస్ట్ అతడిని అడ్డుకుని క్యూలో రావాలని కోరింది. 
 
దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. కాలితో తన్ని, జట్టుపట్టి లాగి తీవ్రంగా కొట్టాడు. పక్కనే ఉన్న కొంతమంది అతడిని బలవంతంగా పట్టుకుని బయటకు పంపించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గోకుల్ ఝాను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments