Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి మమతా బెనర్జీ షాక్

Webdunia
శనివారం, 10 జులై 2021 (07:12 IST)
అధికార తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీకి ‘టెక్నికల్’ షాక్ ఇచ్చారు. బీజేపీ టిక్కెట్‌పై విజయం సాధించి, తిరిగి సొంతగూటికి చేరిన ముకుల్ రాయ్‌కు కీలక పదవిని అప్పజెప్పారు.పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌ (పీఏసీ) గా ముకుల్ రాయ్‌ను నియమిస్తూ సీఎం బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు.

ఈయన నియామకాన్ని అసెంబ్లీ స్పీకర్ బిమన్ బందోపాధ్యాయ కూడా ఆమోదం తెలిపారు. వాస్తవానికి పీఏసీ చైర్మన్ ప్రతిపక్ష నేతకు ఇవ్వడం అన్ని రాజకీయ పక్షాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఈ ఒకే ఒక్క వ్యూహంతో సీఎం మమత బీజేపీని ఇరుకున పెట్టారు.

టెక్నికల్‌గా ముకుల్ రాయ్ ఇంకా బీజేపీ ఎమ్మెల్యేయే. ప్రతిపక్ష నేతకు ఇవ్వాలన్న సంప్రదాయాన్ని తాము పాటించినట్లూ జరిగింది. అదే సమయంలో తమ పార్టీకే చెందిన ముకుల్ రాయ్‌‌కే ఈ పదవి ఇచ్చినట్లైంది. ఈ వ్యూహంతో బీజేపీ ఇరుకునపడినట్లేనని తృణమూల్ నేతలు పేర్కొంటున్నారు.

అయితే ముకుల్ రాయ్ నియామకంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. బీజేపీ టిక్కెట్‌పై ఆయన విజయం సాధించారని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేత సుబేందు నేతృత్వంలో ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ముకుల్ రాయ్‌ను పీఏసీ చైర్మన్‌గా నియమించి, అధికార తృణమూల్ నియమ నిబంధనలను తుంగలో తొక్కిందని సుబేందు తీవ్రంగా దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments