Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతా బెనర్జీ ఓ సూర్పణఖ : బీజేపీ ఎమ్మెల్యే

అధికారమత్తులో జోగుతున్న భారతీయ జనతా పార్టీ నేతల నోటికి తాళం పడటం లేదు. మొన్నటికిమొన్న బీఎస్పీ అధినేత మయావతిని వ్యభిచారిణిగా సంభోదించిన బీజేపీ నేతలు ఇపుడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (13:59 IST)
అధికారమత్తులో జోగుతున్న భారతీయ జనతా పార్టీ నేతల నోటికి తాళం పడటం లేదు. మొన్నటికిమొన్న బీఎస్పీ అధినేత మయావతిని వ్యభిచారిణిగా సంభోదించిన బీజేపీ నేతలు ఇపుడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీని సూర్పణఖతో పోల్చారు.
 
ఆయన పేరు సురేంద్ర సింగ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బైరియా ఎమ్మెల్యేగా ఉన్నారు. పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ సర్కారు హయాంలో హిందువులపై దాడులు జరుగుతుండటంతో ఈయన ఆ తరహా విమర్శలు గుప్పించారు. హింస జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు.
 
'మమతా బెనర్జీ సూర్పణఖ పాత్రను పోషిస్తున్నారు. వీధుల్లో ప్రజలను చంపుతున్నా ముఖ్యమంత్రిగా ఆమె ఏమీ చేయడం లేదు. బెంగాల్లో హిందువులకు రక్షణ లేదు. ఇలానే వదిలేస్తే పరిస్థితి జమ్మూకాశ్మీర్ తరహాలో మారిపోతుంది. జమ్మూకాశ్మీర్ నుంచి హిందువులు వలస వెళ్లిన పరిస్థితే పశ్చిమబెంగాల్లోనూ ఏర్పడుతుంది' అని సురేంద్ర  సింగ్ వ్యాఖ్యానించారు. 
 
భారతీయ జనతా పార్టీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టీ నేతలకు ఇటీవలే హితవు పలికారు. మైక్ ఉందికదాని ఇష్టానుసారంగా నోటిని పారేసుకోవద్దనీ, దీనివల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందటూ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, బీజేపీ నేతల నోటికి తాళం పడటం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments