Webdunia - Bharat's app for daily news and videos

Install App

సువేందు ఎన్నిక చెల్లదంటూ కోర్టుకెక్కిన మమతా బెనర్జీ

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (11:02 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కోర్టు కెక్కారు. ముగిసిన ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానంలో తనపై విజయం సాధించిన బీజేపీ నేత సువేందు అధికారి ఎన్నిక చెల్లదని పేర్కొంటూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఇటీవల ముగిసిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ నేత సువేందు అధికారి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ దీదీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
మే 2న జరిగిన ఓట్ల లెక్కింపు సందర్భంగా నందిగ్రామ్‌ కౌంటింగ్‌ సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలి 11 రౌండ్లలో అధికారి వెనుకంజలో ఉన్నప్పటికీ.. తర్వాత నాలుగు రౌండ్లలో ఆయన అనూహ్యంగా పుంజుకున్నారు. ఓ దశలో ఏకంగా 11 వేల ఓట్ల తేడాతో ముందంజలో కొనసాగారు.
 
దీనిపై మమతా బెనర్జీ అనేక అనుమానాలు లేవనెత్తారు. కౌంటింగ్‌ సమయంలో నాలుగు గంటల పాటు సర్వర్‌ డౌన్‌ అయ్యిందని.. ఆ సమయంలో అవకతవకలు జరిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. 
 
తాను గెలుపొందానని.. దానికి గవర్నర్‌ సైతం శుభాకాంక్షలు తెలియజేశారని పేర్కొన్నారు. కానీ, ఒక్కసారిగా ఫలితాలన్నీ తారుమారయ్యాయని వాపోయారు. రీకౌంటింగ్‌ కోరినప్పటికీ ఎన్నికల సంఘం ఒప్పుకోలేదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments