Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

ఠాగూర్
గురువారం, 7 ఆగస్టు 2025 (15:12 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిటి) జరుపుతున్న తవ్వకాల్లో పురుషుడి అస్థిపంజరంతో పాటు పలు మానవ ఎముకలు లభ్యమైనట్టు కర్నాటక హోం మంత్రి జి.పరమేశ్వర తొలిసారి అధికారికంగా వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఒక గుర్తు తెలియనివ్యక్తి తాను 13 ప్రాంతాల్లో మృతదేహాలను పాతిపెట్టినట్టు ఫిర్యాదు చేశాడు. అతని వాంగ్మూలం ఆధారంగా సిట్ బృందాలు ఆ ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టాయి ఆరో ప్రదేశంలో ఒక పురుషుడి అస్థిపంజరం లభించింది. దీంతో పాటు మరో కొత్త ప్రదేశంలోనూ కొన్ని ఎముకలు లభ్యమయ్యాయి. లభ్యమైన అన్ని అవశేషాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపాం అని ఆయన వివరించారు. 13వ స్థానంలో మాత్రం ఇంకా ఏమీ లభించలేదన్నారు. 
 
ఫిర్యాదుదారుడు మేజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇస్తూ తాను వందల సంఖ్యలో మృతదేహాలను పాతిపెట్టినట్టు చెప్పడంతో  ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి సిట్ ఏర్పాటు చేసిందని పరమేశ్వర వెల్లడించారు. దర్యాప్తులో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని, శాస్త్రీయంగా, సాంకేతిక పరిజ్ఞానంతో నిజానిజాలను నిగ్గు తేల్చాలని సిట్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

కార్మికులకు వేతనాలు పెంచే అవకాశం లేదు : మైత్రీ మూవీస్ నవీన్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments