Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిపుర సుందరి ఆలయంలో షార్ట్ వీడియోల చిత్రీకరణకపై నిషేధం!!

వరుణ్
శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (09:30 IST)
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లోని త్రిపుర సుందరి ఆలయంలో షార్ట్ వీడియోస్ చిత్రీకరణపై నిషేధం విధించింది. ఆలయ ప్రాంగణంలో అభ్యంతరకరరీతిలో చిత్రీకరించిన వీడియోలు వైరల్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలయ అధికారులు.. ఇకపై షార్ట్ వీడియోల చిత్రీకరణను నిషేధిస్తూ ఆదేశాలు జారీచేశారు. పైగా, ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
భారత ఉపఖండంలోని 51 శక్తిపీఠాల్లో త్రిపుర సుందరి ఆలయం ఒకటన్న విషయం తెలిసిందే. ఆలయ ప్రాంగణం కూర్మాకారంలో ఉండటంతో ఈ ఆలయం కూర్మపీఠంగా ప్రసిద్ధికెక్కింది. ఆలయంలో బౌద్ధ స్తూప లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆలయ ప్రధాన ద్వారం దక్షిణానికి అభిముఖంగా ఉండటం ఈ ఆలయం మరో ప్రత్యేకత. ఉత్తర దిక్కున కూడా ఓ చిన్న ప్రవేశద్వారం ఉంది. మధ్యయుగాల నాటి బెంగాలీ ఛార్ చాలా నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
 
ధాన్య మాణిక్య అనే రాజు 1501లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. తొలుత విష్ణువు కోసం ఆలయం నిర్మించినప్పటికీ రాజుకు కలలో అమ్మవారు కనిపించడంతో ఆయన శక్తి పీఠాన్ని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్‌లోని చట్టగాంగ్‌ నుంచి తెప్పించిన కస్తి శిలతో విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. అలాంటి స్థల పురాణం కలిగిన ఈ ఆలయ ప్రాంగణంలో అభ్యంతరకర రీతిలో తీసిన ఓ షార్ట్ వీడియో ఇటీవల వైరల్ అయింది. 'ఆలయంలో అసభ్యకర పాటలు, నృత్యాలతో షార్ట్ వీడియోలు, రీల్స్ తీయడంపై నిషేధం విధించాం. ఆలయం బ్యాక్‌గ్రౌండ్‌గా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దు' అని అధికారులు నోటీసు విడుదల చేశారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments