Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో ఘోరం - లారీ - బస్సు ఢీ - 9 మంది మృతి

Webdunia
మంగళవారం, 24 మే 2022 (09:42 IST)
కర్నాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. బస్సు, లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందివరకు గాయపడ్డారు. ఈ దుర్ఘటన హుబ్లీ - ధర్వాడ్‌లో పూణె - బెంగుళూరు జాతీయ రహదారిపై తారిహా బైపాస్ వద్ద సోమవారం అర్థరాత్రి జరిగింది. 
 
కొల్లపూర్‌ నుంచి బియ్యం లోడుతో వెళుతున్న లారీ ఒకటి, ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురెదురుగా ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ, బస్సు ముందు భాగాలు నుజ్జునుజ్జు అయిపోయాయి. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో వ్యక్తి, బస్సులోని నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో మరో ముగ్గురు చనిపోయారు. 
 
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో మరో 23మ మంది గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలోని క్షతగాత్రులను హుబ్లీ కమిషనర్ పరామర్శించి, మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments