Webdunia - Bharat's app for daily news and videos

Install App

టంగుటూరులో ఘోర రైలు ప్రమాదం.. రూ.80లక్షల నష్టం.. పట్టాలు తప్పడంతో?

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (12:07 IST)
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో అర్ధరాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గూడ్సు రైలు నాయుడుపాలెం-బాపూజీనగర్ మధ్య సూరారెడ్డి పాలెం వద్ద వంతెన దాటుతుండగా చివరన బోగీలు విడిపోయి మంటలు అంటుకున్నాయి. ట్రాక్ కుంగిపోవడంతో బోగీలు పట్టాలు తప్పాయి. దాంట్లో డీజిల్‌ ఉండడంతో వెంటనే మంటలు చెలరేగాయి.
 
ఈ ప్రమాదంలో రూ.80లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే.. 200మీటర్ల మేర రైల్వే ట్రాక్‌ దెబ్బతింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. 
 
మంటలను అదుపు చేయలేకపోతే మిగిలిన బోగీలకు కూడా మంటలు అంటుకునేవని అధికారులు చెప్పారు. భారీ ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రాక్ కుంగిపోవడం వల్లే ప్రమాదం సంభవించినట్టు అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments