ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. ముఖ్యంగా, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో ఈ మూడు జిల్లాల్లో ఆదివారం నుంచి లాక్డౌన్ అమలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.
అయితే, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు మాత్రమే కిరాణా సరకుల షాపులు తెరిచివుంచుతారు. అదేసమయంలో కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠిన ఆంక్షలతో లాక్డౌన్ అమలు చేయనున్నారు.
దీనికి కారణం లేకపోలేదు. గత 24 గంటల్లో 465 కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7961కు చేరుకున్నాయి. వీటికి కొత్త కేసులు అదనం.
మరోవైపు, అనంతపురం జిల్లా పోలీసులు లాక్డౌన్ వేళ మరింత కఠినంగా ఉండనున్నారు. మాస్క్ లేకుండా కనిపించిన వారిని క్వారంటైన్‌కు తరలించనున్నట్టు ప్రకటించారు.
జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కొందరు మాత్రం ఇవేం పట్టించుకోకుండా, యధేచ్చగా లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అలాగే, సామాజికి భౌతిక దూరాన్ని అస్సలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించాలని పోలీసులు నిర్ణయించారు.