Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళగా బోర్ కొట్టేసింది.. పురుషుడిగా మారిపోతా.. ఓకే చెప్పిన సర్కారు

ఆమెకు ఒక మహిళగా జీవించడం బోర్ కొట్టేసింది. పైగా, ఈమె ఓ మహిళా కానిస్టేబుల్. దీంతో పురుషుడిగా మారాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం సెక్స్ మార్పిడి చేయించుకోవాలని భావించింది.

Webdunia
మంగళవారం, 22 మే 2018 (08:19 IST)
ఆమెకు ఒక మహిళగా జీవించడం బోర్ కొట్టేసింది. పైగా, ఈమె ఓ మహిళా కానిస్టేబుల్. దీంతో పురుషుడిగా మారాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం సెక్స్ మార్పిడి చేయించుకోవాలని భావించింది. అనుకున్నదే తడువుగా ప్రభుత్వ అనుమతి కోరింది. ఆ మహిళా కానిస్టేబుల్ కోర్కె మేరకు అవయవ మార్పిడికి మహారాష్ట్ర సర్కారు అనుమతి ఇచ్చింది. ఆ వివరాలను పరిశీలిస్తే...
 
ముంబై నగరంలో లలిత (29) అనే మహిళ కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. 2010వ సంవత్సరం నుంచి విధులు నిర్వర్తిస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో తాను పురుషుడిగా మారేందుకు వీలుగా సెక్స్ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునేందుకు అనుమతించాలని కోరుతూ మహారాష్ట్ర డీజీపీకి ఆమె ఒక వినతిపత్రం సమర్పించింది. తొలుత లలిత చేసిన అభ్యర్థనను డీజీపీ తిరస్కరించారు. దీంతో లలిత బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 
 
దీనిపై హైకోర్టు సూచనతో సీఎం ఫడ్నవీస్, మహారాష్ట్ర హోంశాఖ మంత్రి డాక్టర్ రంజిత్ పాటిల్‌లు స్పందించి లలితకు సెక్స్ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునేందుకు అనుమతించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ముంబై పోలీసు ఎస్పీ జి. శ్రీధర్ లలిత సెక్స్ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునేందుకు అనుమతినివ్వడంతో పాటు ఆమెకు నెలరోజుల పాటు సెలవు కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఫలితంగా లలిత తన మామయ్యతో కలిసి జేజే ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకునేందుకు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం