Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పశ్చిమబెంగాల్: మహిళకు దారుణ అవమానం.. మెడలో బూట్ల దండవేసి?

మహిళ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మహిళకు దారుణ అవమానం జరిగింది. అదెక్కడంటే.. పశ్చిమబెంగాల్‌లో. వివరాల్లోకి వెళితే.. అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిందనే అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తలు ఆమె మెడలో బూట్ల

పశ్చిమబెంగాల్: మహిళకు దారుణ అవమానం.. మెడలో బూట్ల దండవేసి?
, సోమవారం, 21 మే 2018 (16:13 IST)
మహిళ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మహిళకు దారుణ అవమానం జరిగింది. అదెక్కడంటే.. పశ్చిమబెంగాల్‌లో. వివరాల్లోకి వెళితే.. అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిందనే అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తలు ఆమె మెడలో బూట్ల దండ వేశారు. అంతటితో ఆగకుండా దుర్భాషలాడారు. ఊరంతా తిప్పారు. ఈ ఘటన పశ్చిమ మిడ్నాపూర్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనపై విపక్ష నేతలు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
 
కాగా ఈ నెల 14న జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా బాగ్‌డుబి గ్రామంలో ఓ పోలింగ్ బూత్‌ను తృణమూల్ కార్యకర్తలు ఆక్రమించుకున్నారు. దీనిని గమనించిన మహిళ వారికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించింది. ప్రజాస్వామ్య పద్ధతితో గెలవాలని సవాల్ చేస్తూ ధర్నా చేసింది.
 
ఆమె స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తోందని భావించిన తృణమూల్ కార్యకర్తలు ఆమెను పార్టీ కార్యాలయానికి పిలిపించి అసభ్య పదజాలంతో దూషించారు. అక్కడితో ఆగక ఆమె మెడలో బూట్ల దండ వేసి గ్రామంలో ఊరేగించారు. రెండు చేతులతో చెవులను పట్టుకుని కూర్చోవాల్సిందిగా ఆదేశించారు. మహిళను దారుణంగా అవమానించిన వీడియో బయటకు వచ్చింది. ఇంకా బాధిత మహిళ భర్త తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత కావడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాన్నా.. కడుపునొప్పిగా ఉంది.. వచ్చి పక్కన పడుకో.. మూడేళ్ళపాటు కుమార్తెను?