Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనకోడలు ఇష్టమైన వ్యక్తితో పారిపోయిందనీ విందు భోజనంలో విషం!!

ఠాగూర్
గురువారం, 9 జనవరి 2025 (11:07 IST)
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లా ఫన్హాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణం జరిగింది. తన చేతుల్లో పెరిగిన మేనకోడలు ఇష్టమైన వ్యక్తితో పారిపోయిన పెళ్లి చేసుకుందన్న ఆవేదనతో ఓ మేనమామ విందుభోజనంలో విషం కలిపాడు. ఓ వివాహ రిసెప్షన్‌లో ఈ ఘటన జరిగింది. ఉట్రే గ్రామంలోని మేనమామ మహేశ్ పాటిల్ ఇంట్లో పెరిగిన ఆ యువతి తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేసుకోవడం కుటుంబసభ్యులకు నచ్చలేదు. 
 
అయిష్టంగానే ఆ జంటను ఆశీర్వదించి రిసెప్షను ఏర్పాటు చేశారు. ఆందోళనతో రగిలిపోతున్న మేనమామ మహేశ్ అతిథుల కోసం సిద్ధం చేస్తున్న భోజనాల్లో విషం కలిపాడు. దూరం నుంచి దీన్ని గమనించిన కొందరు వ్యక్తులు మహేశ్ను నిలదీయడంతో అతడు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. అతిథులు ఆ భోజనం ఆరగిస్తే పెద్ద అనర్థమే జరిగేది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఆహార పదార్థాలను ఫోరెన్సిక్ ల్యాబుకు పంపారు. 
 
డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే తొక్కిసలాట : తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు 
 
అడ్మినిస్ట్రేషన్ లోపం వల్లే తొక్కిసలాట జరిగిందని, గొడవలు జరుగుతాయని సమాచారం ఉందని ముందుగానే హెచ్చరించానని తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమల వైకుంఠ - ఏకాదశి ద్వార దర్శనాలకు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద అడ్మినిస్ట్రేషన్ లోపమే కారణంగానే తొక్కిసలాట జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఈ తొత్కిసలాటపై ఆయన స్పందిస్తూ, టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాటల్లో భక్తులు చనిపోవడం దురదృష్టకరమని, జరగరానిది జరిగిందని విచారం వ్యక్తం చేశారు. 'వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత అడ్మిస్ట్రేషన్ లోపం కారణంగా జరిగిందని నాకు అనుమానం ఉంది. ఘటనకు బాధ్యత అధికారులదే కదా. మంగళవారం కూడా నేను అధికారులతో సమావేశమై ఆషామాషిగా తీసుకోవద్దని చెప్పాను. 
 
గొడవలు జరుగుతాయని నాకు సమాచార ముందని హెచ్చరించాను. ఐదు వేలమంది పోలీసులను పెట్టామని, చూసుకుంటామని అధికారులు చెప్పారు. టోకెన్లు జారీ చేసే ఒక సెంటరులో ఓ మహిళ అస్వస్థతకు గురైన క్రమంలో ఆమెను బయటకు తీసుకువచ్చేందుకు అక్కడున్న డీఎస్పీ గేట్లు తెరవడంతో భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తోపులాట జరిగింది. అందులో ఆరుగురు చనిపోయినట్టు తెలిసింది' అని బీఆర్ నాయుడు అన్నారు. 
 
డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని, తొక్కిసలాటలో భక్తుల మృతి దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారనీ, గాయపడ్డ వారిని చంద్రబాబు పరామర్శించి, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందచేస్తారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments