Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 నెలల గర్భవతిని హత్య చేసిన భర్త.. రాత్రంతా శవం పక్కనే...

Webdunia
ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (10:01 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఐదు నెలల గర్భవతిని కిరాతక భర్త హత్య చేశాడు. ఆ తర్వాత రాత్రంతా ఆమె శవం పక్కనే కూర్చొన్నాడు. తెల్లారగానే తన భార్యను చంపేశానని ఇరుగు పొరుగు వారికి చెప్పాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని ఒమెర్గా తెహ్‌సిల్ ప్రాంతంలో వినోద్ దాన్సింగ్ పవన్ అనే వ్యక్తి ప్రియాంకా రాథోడ్ అనే మహిళను ఆర్నెల్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రియాంకా ఐదు నెలల గర్భవతి. అయితే, గురువారం రాత్రి భార్యాభర్తలిద్దరూ ఓ చిన్న విషయంపై గొడవపడ్డారు. దీంతో ఆవేశానికి గురైన వినోద్.. భర్తపై దాడి చేయడంతో ఆమె కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. 
 
ఆ తర్వాత ఏం చేయాలోతోచక.. భార్య మృతదేహం వద్దనే రాత్రంతా కూర్చుండిపోయాడు. శుక్రవారం ఉదయాన్నే లేచి వెళ్లి భార్యను హత్యచేసినట్లు నేరాన్ని అంగీకరించి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. అయితే మృతురాలి బంధవులు మాత్రం పవన్ తరచూ భార్య ప్రియాంకను వేధిస్తూ ఉండేవాడని... అదనపు కట్నం కావాలని డిమాండ్ చేసేవాడని ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి వినోద్‌ను అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం