Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టెస్టు కోసం శాంపిల్స్ సేకరణ : మహిళ ప్రైవేట్ భాగంలోకి...

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (18:06 IST)
మహారాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. కరోనా టెస్టు కోసం శాంపిల్స్ సేకరణ కోసం ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఒక మహిళ ప్రైవేట్ భాగంలో చేయిపెట్టి స్వాబ్ సేకరించి, అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆ యువతి తన సోదరుడికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్ర, అమరావతిలోని ఓ మాల్‌లో పని చేసే ఉద్యోగుల్లో కొందరికి కరోనా వైరస్ సోకింది. దీంతో స్థానిక వైద్యాధికారులు మాల్‌లోని ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించారు. దీంతో ట్రామా కేర్ సెంటర్‌కు చెందిన అల్కేష్ దేశ్‌ముఖ్ అనే ఒక ల్యాబ్ టెక్నీషియన్ మాల్ ఉద్యోగులందరి వద్జ శాంపిల్స్ సేకరించారు. వీరిలో ఒక యువతి వద్ద అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
తొలుత ముక్కు, గొంతు ద్వారా స్వాబ్ సేకరించిన తర్వాత మిగిలిన టెస్టుల కోసం ల్యాప్‌కి పిలిపించాడు. అక్కడ ఆమెను పడుకోబెట్టి.. ఆమె ప్రైవేట్ భాగం నుంచి స్వాబ్ సేకరించాలని నమ్మించి యోని భాగంలో చేయి పెట్టి స్వాబ్ సేకరించాడు. 
 
ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంపై బాధిత యువతి కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం