Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ కులం సర్టిఫికేట్ రద్దు : రూ.2 లక్షల అపరాధం

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (14:55 IST)
మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా చిక్కుల్లో పడ్డారు. ఆమె కులం సర్టిఫికేట్‌ను బాంబే హైకోర్టు రద్దుచేసింది. తాను షెడ్యూల్ క్యాస్ట్ కులానికి చెందినదిగా ఆమె చూపిన కులం సర్టిఫికేట్ నకిలీదని తేలింది. దీంతో ఆమె కులం సర్టిఫికేట్‌ను రద్దు చేసిన కోర్టు... ఆమెకు రూ.2 లక్షల అపరాధం విధించింది. 
 
2019లో మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. కానీ, ఆమె సమర్పించిన కులం సర్టిఫికేట్ నకిలీదని కోర్టు తేల్చింది. దీంతో ఆమె ఇపుడు చిక్కుల్లో పడ్డారు.
 
తొలిసారి అమరావతి లోక్‌సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె... ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులను ఓడించి గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. కానీ, ఇపుడు ఆమె కులం సర్టిఫికేట్ ఫేక్ అని తేలడంతో ఇపుడు ఆమె తన లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోనున్నారు. 
 
కాగా, పంజాబ్‌కు చెందిన నవనీత్ కౌర్... ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఈ సర్టిఫికేట్‌ను పంజాబ్ ప్రభుత్వం జారీ చేయగా, అది మహారాష్ట్రలో నకిలీదని ఎలా ఆమె ప్రశ్నిస్తున్నారు. పైగా, ఇదే అంశంపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. 
 
అయితే, స్థానికంగా మరో రకమైన వార్తలు వినిపిస్తున్నాయి. నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసిన నవనీత్ కౌర్... కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు మ్యానేజ్ చేసి.. నకిలీ కులం ధృవీకరణ పత్రాన్ని పొందినట్టు సమాచారం. మొత్తంమీద సినిమా నటి అయిన నవనీత్ కౌర్ ఇపుడు చిక్కుల్లోపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments