Webdunia - Bharat's app for daily news and videos

Install App

80 యేళ్ళ వృద్ధుడుకి రూ.80 కోట్ల కరెంట్ బిల్లు

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (12:41 IST)
సాధారణంగా కోటీశ్వరులకు కూడా నెలవారి కరెంట్ బిల్లు రాదు. ఇక సామాన్య ప్రజానీకానికి అయితే, వందలు లేదా వేలాది రూపాయల్లో వస్తుంది. వేసవిలో అయితే కాస్తంత ఎక్కువ మొత్తంలో వస్తుంది. అలాంటి ఓ సామాన్య వృద్ధుడుకి ఏకంగా రూ.80 కోట్లలో కరెంట్ బిల్లు వచ్చింది. దాన్ని చూడగానే ఆయనకు గుండె ఆగిపోయినంతపని అయింది. కరెంట్‌ బిల్లు చూసి ఆ వృద్ధుడికి నిజంగానే షాక్‌ తగిలింది. బీపీ అమాంతం పెరిగిపోయింది. దీంతో స్మృహ కోల్పోయి కిందపడిపోయాడు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర నలసోపారా టౌన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నలసోపార్ టౌన్‌కు చెందిన గణ్‌పత్‌ నాయక్‌ (80) అనే వృద్ధుడు స్థానికంగానే రైస్‌ మిల్లు నడుపుతున్నాడు. ఈ మిల్లుకు కరెంట్ బిల్లు వచ్చింది. దాన్ని చూడగానే ఆయన ఒకింత షాక్‌కు గురయ్యాడు. అది వేలల్లో కాదు ఏకంగా రూ.కోట్లల్లో కరెంట్‌ బిల్లు వచ్చింది. 80 కోట్ల రూపాయల కరెంట్‌ బిల్లు చూసి అతడి బీపీ పెరిగింది. కింద పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.
 
ఈ ఘటనపై మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎంఎస్‌ఈడీసీఎల్‌) స్పందించింది. ఇది అనుకోకుండా జరిగిన తప్పిదమని.. తర్వలోనే బిల్లును సరిచేస్తామన్నారు. మీటర్ రీడింగ్ తీసుకునే ఏజెన్సీ చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది అని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments