Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాకుంభమేళా తొక్కిసలాట : యూపీ సర్కారు బాధ్యత వహించాలి... సుప్రీంలో పిటిషన్

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (12:23 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మౌని అమావాస్య సందర్భంగా సంగం ఘాట్‌ వద్ద చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని వేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అందులో కోరారు. భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా నివారించేలా వీఐపీల కదలికలను ఆపాలని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ వ్యాజ్యం నేపథ్యంలో తొక్కిసలాటపై యూపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.  
 
కాగా, జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ వేడుక ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా. 45 రోజుల పాటు జరగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జనవరి 29 వరకు 27 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments