Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళ హత్య కేసు - వైకాపా మాజీ ఎంపీ నదింగంకు సుప్రీంకోర్టు షాక్!!

Nandigam

ఠాగూర్

, బుధవారం, 8 జనవరి 2025 (09:39 IST)
తన సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ హత్య కేసులో నిందితుడుగా ఉన్న వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సుప్రీంకోర్టు తేరుకోలేని షాక్ ఇచ్చింది. బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో నేర చరిత్రను దాచిపెట్టినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. 
 
గత 2020లో ఎస్సీ సమాజిక వర్గాల్లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో తుళ్లూరు మండలం, వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మ ఇంటిపై అప్పటి వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు దాడి చేయగా, ఆమె చనిపోయారు. 
 
దీనిపై మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు. ఈ కేసులో నాటి ఎంపీ సురేశ్‌ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో బెయిల్ కోసం సురేశ్ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. కేసు తీవ్రతను గుర్తించిన హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్చును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 
 
మంగళవారం ఈ పిటిషన్ జస్టిన్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌ల ద్విసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసినప్పుడు సురేశ్ తనపై ఎలాంటి నేరచరిత్ర లేదని చెప్పారని, కానీ అప్పటికే ఆయనపై ఐదు కేసులు ఉన్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టు దృష్టికి తెచ్చారు. సురేశ్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బెయిల్ మంజూరుకు నేరచరిత్రతో సంబంధం లేదన్నారు. 
 
ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ధర్మాసనం నేరచరిత్రను దాచిపెట్టడం గమనించదగ్గ అంశమని పేర్కొంది. పాత కేసుల వివరాలను దాచిపెట్టారన్న కారణంతో ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయనందున తాము కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం పేర్కొంది. హత్య కేసులో చార్జిషీటు కూడా దాఖలైనందున బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నందిగంకు సూచిస్తూ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూర్పు తీరంలో ప్రగతిహారాల్లా భాసిల్లే ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన!!