Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాంతర పెళ్లి చేసుకుందనీ... గర్భవతి కడుపులో కస్సక్కన కత్తి దించిన కసాయి తండ్రి

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (11:20 IST)
తమిళనాడు రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. కంటికి రెప్పాలా పెంచిన కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడాన్ని ఆ కన్నతండ్రి జీర్ణించుకోలేక పోయాడు. తన పరువు తీసిందంటూ తన స్నేహితుల వద్ద వాపోయాడు. ఈ క్రమంలో కుమార్తె గర్భందాల్చింది. అయినప్పటికీ అతనిలోని పగ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో నిండు గర్భంతో ఉన్న కుమార్తెను కత్తితో పొడవడంతో ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ ఘటన మదురై జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మదురై జిల్లా నాగయ్యపురానికి చెందిన గురునాథన్ (55) అనే వ్యక్తి స్థానికంగా వ్యవసాయ ఎరువుల వ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు భార్యతో పాటు.. బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతూ మధ్యలో ఆపేసిన సుష్మ అనే 19 యేళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం ఈమె ఇంటిపట్టునే ఉంటూ వస్తోంది. 
 
ఈ క్రమంలో పక్క ఊరికి చెందిన శివశంకరన్‌ (23) అనే యువకుడితో పాఠశాలలో చదువుకునే సమయంలోనే ఆమె ప్రేమలో పడింది. అయితే, ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అయినప్పటికీ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో ఇంట్లో చెప్పాపెట్టకుండా లేచిపోయిన ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించారు. 
 
దీంతో పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. శివశంకరన్‌ను తమ అల్లుడిగా అంగీకరించేది లేదని సుష్మ తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. అయితే, ప్రేమికులు మాత్రం పెళ్లి చేసుకుంటామని పట్టుబట్టడంతో పోలీసులే దగ్గరుండి వివాహం జరిపించారు. ఆ తర్వాత ఈ కొత్తదంపతులు వాళవందాన్‌‌పురంలో కాపురం పెట్టారు. 
 
ఈ పరిస్థితుల్లో గర్భిణి అయిన సుష్మ, భర్తతో కలిసి, ఆరోగ్య కేంద్రానికి పరీక్షల నిమిత్తం వెళ్లగా, అక్కడికి వచ్చిన సుష్మ తండ్రి, ప్రేమగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ, కత్తితో దాడి చేశాడు. ఆ వెంటనే శివశంకరన్‌ పరుగున వచ్చి, భార్యను పక్కకు లాగేసి, ఆమెను కాపాడాడు. సుష్మకు ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు, మెరుగైన చికిత్స కోసం తిరుమంగళం ఆసుపత్రికి పంపగా, పోలీసులు గురునాథన్‌ను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం