Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నతండ్రే దగ్గరుండి అత్యాచారం చేయించాడు.. 'స్పందన'లో బోరుమన్న బాలిక

Advertiesment
కన్నతండ్రే దగ్గరుండి అత్యాచారం చేయించాడు.. 'స్పందన'లో బోరుమన్న బాలిక
, మంగళవారం, 23 జులై 2019 (10:17 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమానికి వివిధ రకాల సమస్యలపై బాధితులు ఫిర్యాదు వస్తున్నాయి. ఇందులోభాగంగా, ఓ బాలిక చేసిన ఫిర్యాదు ఇపుడు రాష్ట్రంలో కలకలం రేపింది. కన్నతండ్రే దగ్గరుండి తనపై అత్యాచారం చేయించాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సీఎం జగన్ ఆదేశం మేరకు సోమవారం ఏపీ వ్యాప్తంగా స్పందన కార్యక్రమం జరిగింది. అలాగే, గుంటూరులో కూడా జరిగింది. ఈ 'స్పందన' కార్యక్రమంలో పట్టణ ఏఎస్పీ వైటీ నాయుడు ముందు ఓ బాలిక కన్నీటితో ఫిర్యాదు చేసింది. తమ బంధువేనని చెబుతూ తండ్రి ఓ యువకుడిని ఇంటికి తీసుకొచ్చాడనీ, అతను కొట్టి, సిగరెట్లతో కాల్చి భయపెడుతూ, అత్యాచారం చేశాడని, ఆ సమయంలో తండ్రికూడా ఇంట్లోనే ఉన్నాడని ఆ బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఈ ఫిర్యాదు పట్టణంలో కలకలం రేపింది. ఈ కేసును ఏఎస్పీ వైటి నాయుడు సీరియస్‌గా తీసుకున్నారు. తాను ఇప్పటికే ఇద్దరిపై ఫిర్యాదు చేశానని, తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో కేసు నుంచి అతని పేరును పోలీసులు తొలగించారని ఆమె చెప్పగా, తాను విచారణ జరిపించి న్యాయం చేస్తానని నాయుడు అభయమిచ్చారు.
 
ఆ తర్వాత ఆ బాలిక మీడియాతో మాట్లాడుతూ, గుంటూరులో ఇంటర్మీడియట్‌ చదువుతున్నానని పేర్కొన్న ఆమె, తన తల్లిదండ్రుల మధ్య విభేదాలు రాగా, తల్లి గతంలోనే తండ్రిపై ఫిర్యాదు చేసిందని తెలిపింది. ఈ కేసులో విచారణ జరుగుతోందని, తాను అప్పటి నుంచి తల్లి వద్దే ఉంటున్నట్టు చెప్పింది. ఒకరోజు తాను చదువుతున్న కాలేజీ వద్దకు కృష్ణ అనే యువకుడిని తీసుకొచ్చిన తండ్రి బంధువుగా పరిచయం చేశాడని, అతను తనను తరచూ కలిసి మాట్లాడేవాడని తెలిపింది.
 
ఈ క్రమంలో ఆరోజు తనతో మాట్లాడాలని ఓ లాడ్జికి తీసుకెళ్లిన కృష్ణ, తనను చిత్రహింసలు పెట్టి, అత్యాచారం చేసి, మొబైల్ ఫోన్‌లో వీడియోలు తీశాడని, విషయం బయటకు చెబితే వాటిని ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడని చెప్పుకొచ్చింది. తనను బెదిరించి, మరోమారు అత్యాచారం చేశాడని, ఆ సమయంలో తన తల్లి తనకు పదేపదే ఫోన్ చేస్తుంటే, బస్టాండ్‌ వద్ద వదిలిపెట్టి వెళ్లాడని, ఎందుకు ఆలస్యమైందని తల్లి నిలదీయగా, విషయం చెప్పానని బాధితురాలు పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ : దొంగ ఓట్లతో కింగ్ కాంగ్‌ను గెలిపించాడు...