Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాహిల్‌రమణికి అనూహ్య మద్దతు.. 18 వేల మంది లాయర్లు విధుల బాయ్‌కట్

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (16:02 IST)
మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తాహిల్ రమణికి మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘం నుంచి అనూహ్య మద్దతు లభించింది. చీఫ్ జస్టీస్ విజయ తాహిల్‌రమణిని మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది. ఈ బదిలీని మద్రాసు హైకోర్టు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఈ బదిలీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్‌కు చెందిన 18 వేల మంది న్యాయవాదులు మంగళవారం కూడా కోర్టు విధులను బహిష్కరించారు. మంగళవారం కేవలం ప్రభుత్వ న్యాయవాదులు మాత్రమే హైకోర్టుకు హాజరయ్యారు. 
 
కాగా, సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ విజయ తాహిల్‌రమణిని మేఘాలయ చీఫ్ జస్టిస్‌కు బదిలీ చేశారు. తనను ఆకస్మికంగా మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని ఉపసంహరించాలని జస్టిస్‌ తాహిల్‌ సుప్రీంకోర్టు కొలీజియంకు ఇదివరకే ఆమె చేసుకున్న అభ్యర్థన తిరస్కరణకు గురైంది. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ రంజన్ గొగోయ్‌కు పంపించిన సంగతి తెలిసిందే. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గత ఏడాది ఆగస్టు 8న ఆమె నియమితులయ్యారు. 
 
మరోవైపు, తాహిల్ రమణి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని అడ్వకేట్స్ విజ్ఞప్తి చేశారు. అలాగే, బదిలీ ఉత్తర్వులను ఆమోదించిన సుప్రీంకోర్టు కొలీజియంకు అప్పీల్ చేయాలని న్యాయవాదులు భావిస్తున్నారు. మంగళవారం నుంచి తమ  ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నామని ప‍్రకటించారు. 
 
మరోవైపు తాహిల్‌ రమణిని ఆమె నివాసంలో కలుసుకున్న తమిళనాడు న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని అభ్యర్థించారు. ఆమె బదిలీ అప్రజాస్వామికమనీ, ఇది న్యాయమూర్తుల స్వాతంత్ర్యాన్ని, కేసులపై వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునే శక్తిని ప్రభావితం చేస్తుందని అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి మోహనకృష్ణన్ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లపై పొంగల్ సాంగ్

అజిత్ కుమార్, త్రిష మూవీ విడాముయర్చి నుంచి లిరిక‌ల్ సాంగ్

డ్రీమ్ క్యాచర్ ట్రైలర్ చూశాక నన్ను అడివిశేష్, రానా తో పోలుస్తున్నారు : ప్రశాంత్ కృష్ణ

క్రిస్మస్ సెలవులను ఆస్వాదిస్తున్న సమంత.. వినాయక పూజ..?

3 సినిమాతో తన కెరీర్ ముదనష్టం అయ్యిందంటున్న శ్రుతి హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments