Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రిలేని తొలిబిడ్డగా తావిసి.. వీర్యదాత పేరు నో.. ఆ కాలమ్ ఖాళీ..

తండ్రిలేని తొలి బిడ్డగా తమిళనాడుకు చెందిన తావిసి రికార్డులకెక్కింది. తావిసి బర్త్ సర్టిఫికేట్‌లో తండ్రి కాలమ్‌ను ఖాళీగా వదిలిపెట్టాలని మద్రాస్ హైకోర్టు అధికారులను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. పరస

Webdunia
ఆదివారం, 20 మే 2018 (11:31 IST)
తండ్రిలేని తొలి బిడ్డగా తమిళనాడుకు చెందిన తావిసి రికార్డులకెక్కింది. తావిసి బర్త్ సర్టిఫికేట్‌లో తండ్రి కాలమ్‌ను ఖాళీగా వదిలిపెట్టాలని మద్రాస్ హైకోర్టు అధికారులను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. పరస్పర అంగీకారంతో తావిసి తల్లిదండ్రులు వేరయ్యారు. ఆపై ఓ వీర్యదాత ద్వారా మధుమిత ఏప్రిల్ 2017లో తావిసికి జన్మనిచ్చింది.
 
త్రిచి కార్పొరేషన్ అధికారులు తావిసికి బర్త్ సర్టిఫికెట్ జారీ చేస్తూ మనీష్‌ను చిన్నారి తండ్రిగా పేర్కొన్నారు. సంతానోత్పత్తి చికిత్స కోసం మధుమితకు సాయం చేసిన మనీష్ పేరును బర్త్ సర్టిఫికెట్‌లో చేర్చారు. దీన్ని నిరసిస్తూ తావిసి తల్లి మధుమిత కోర్టును ఆశ్రయించారు. దీంతో తావిసి తండ్రి కాలమ్‌ నుంచి మనీష్ పేరును తొలగించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
 
మరోవైపు తావిసి తండ్రిని తాను కాదంటూ మనీష్, మధుమిత నుంచి విడిపోయిన భర్త చరణ్ రాజ్‌లు విడివిడిగా కోర్టుకు అఫిడవిట్లు దాఖలు చేశారు. దీంతో స్పందించిన జస్టిస్ ఎంఎస్ రమేష్ నేతృత్వంలోని ధర్మాసనం త్రిచీ కార్పొరేషన్ ముఖ్య వైద్యాధికారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 
 
ఆమె వీర్య దాత ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది కాబట్టి సర్టిఫికెట్ నుంచి మనీష్ పేరును తొలగించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆ కాలమ్‌ను ఖాళీగా వదిలిపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా తండ్రి పేరు లేకుండా బర్త్ సర్టిఫికెట్ జారీ కానున్న తొలి చిన్నారిగా తావిసి రికార్డులకెక్కనుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments