Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకుపై తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లిన కుమారుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (13:55 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యం మరోమారు బట్టబయలైంది. ఇటీవలే సాగర్‌లో ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు టీకాలు వేసిన ఘటన కలకలం రేపిన విషయం తెల్సిందే. తాజాగా మరో అమానవీయ ఘటన జరిగింది. 
 
ఈ రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చనిపోయిన తల్లి మృతదేహాన్ని కన్నబిడ్డ తన బైకుపై కట్టి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామానికి తరలించారు. తల్లి మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో తరలించేందుకు రూ.5 వేలు డిమాండ్ చేశారు. అంత మొత్తం డబ్బులు చెల్లించలేని ఆ యువకుడు.. చివరకు తన బైకునే మార్చురీ అంబులెన్స్‌గా చేసుకుని తల్లి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. 
 
ఇందుకోసం రూ.100 చెల్లించి ఓ చెక్క పలకలు కొని, దానిపై తల్లి మృతదేహాన్ని పడుకోబెట్టి, దాన్ని మోటార్ సైకిల్‌కు కట్టి తీసుకెళ్లారు. ఈ హృదయ విదారక దృశ్యాలను చూసిన కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడిటాలో షేర్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments