Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల ప్యాకెట్లు చోరీ చేస్తూ అడ్డంగా బుక్కైన పోలీస్...

ప్రజలకు రక్షణ కల్పించాలని పోలీసులే.. దొంగలుగా మారితే ఇక రక్షణ సంగతి దేవుడే చూసుకోవాలి. తాజాగా ఓ పోలీసు.. పాల ప్యాకెట్లు చోరీ చేస్తూ సీసీటీవీ కెమెరా కంటికి చిక్కాడు. ఈ వింత దొంగతనం ఎక్కడ జరిగిందో తెలుస

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (11:12 IST)
ప్రజలకు రక్షణ కల్పించాలని పోలీసులే.. దొంగలుగా మారితే ఇక రక్షణ సంగతి దేవుడే చూసుకోవాలి. తాజాగా ఓ పోలీసు.. పాల ప్యాకెట్లు చోరీ చేస్తూ సీసీటీవీ కెమెరా కంటికి చిక్కాడు. ఈ వింత దొంగతనం ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌గఢ్ జిల్లాలోని ఖిల్చీపుర్‌ మార్కెట్‌లో రాత్రివేళ గస్తీ తిరుగుతున్న ఒక పోలీసు పాల ప్యాకెట్లు చోరీచేస్తూ సీసీటీవీకి చిక్కాడు. 40 సెకెన్లున్న ఆ వీడియోలో ఆ పోలీసు నిర్వాకం రికార్డయింది. ఖాకీ గస్తీలో ఉంటూ ఒక దుకాణం వద్దనున్న పాల ప్యాకెట్ల వద్దకు వెళ్లాడు. ఇటు అటు చూసి... పాల ప్యాకెట్ తీసుకుని తిరిగి వచ్చేశాడు. 
 
ఖిల్చీపుర్ మార్కెట్‌లోని సౌరభ్ పాల డెయిరీకి చెందిన ఒక దుకాణంలో ప్రతీ రోజూ పాల ప్యాకెట్లు లెక్కించినప్పుడు తక్కువ ఉంటున్నాయి. దీంతో దొంగతనం జరుగుతున్నదని అనుమానం వచ్చిన ఆ దుకాణం యజమాని... తన షాపు ముందు సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశారు. అతను సీసీటీవీని పరిశీలించగా ఒక పోలీసు పాల ప్యాకెట్ల చోరీకి పాల్పడుతున్నాడని తేలింది. దీంతో ఈ సమాచారాన్ని అతను పోలీసు అధికారులకు తెలియజేశాడు. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments