Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాకీ తీర్చమంటే.. స్క్రూ డ్రైవర్‌తో గుండెల్లో పొడిచాడు.. ఎక్కడ?

ఓ మొబైల్ షాపు మెకానిక్ అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తీసుకున్న అప్పు చెల్లించని అడిగిన పాపానికి తన చేతిలో ఉండే స్క్రూడ్రైవర్‌తో అప్పిచ్చిన వ్యక్తి గుండెల్లో పొడిచాడు. దీంతో బాధితుడు ప్రాణాపాయస్థితిల

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (10:41 IST)
ఓ మొబైల్ షాపు మెకానిక్ అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తీసుకున్న అప్పు చెల్లించని అడిగిన పాపానికి తన చేతిలో ఉండే స్క్రూడ్రైవర్‌తో అప్పిచ్చిన వ్యక్తి గుండెల్లో పొడిచాడు. దీంతో బాధితుడు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణం విజయవాడ చిట్టినగర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చిట్టినగర్‌కు చెందిన గ్రంధి వెంకటరంగారావు అనే వ్యక్తి తన సెల్‌ఫోన్‌ను అమ్మిపెట్టాలని తాజ్ అనే మెకానిక్‌కు ఇచ్చాడు. దీంతో ఈ ఫోనును ఫోన్‌ను రూ.5 వేలకు విక్రయించాడు. అయితే, తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని, ఈ రూ.5 వేలతో పాటు.. అదనంగా మరో రూ.4 వేలు ఇవ్వాలని కోరాడు. దీంతో వెంటకరంగారావు రూ.4 వేలు కూడా తాజ్ అప్పుగా ఇచ్చాడు.
 
ఈ అప్పును తిరిగి చెల్లించాలని ఆదివారం తాజ్‌ను వెంటకరంగారావు అడిగారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికిలోనైన తాజ్... తన చేతిలో ఉన్న స్క్రూడ్రైవర్‌తో వెంకటరంగారావు ఛాతిలో పొడిచి పారిపోయారు. గాయపడిన వెంకటరంగారావును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు తాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments