Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల మతానికి చెందినవారా? ఎంపీ మంత్రి కామెంట్స్

ఠాగూర్
బుధవారం, 14 మే 2025 (10:26 IST)
Sofia Qureshi
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన కీలక సమాచారాన్ని మీడియాకు వెల్లడించిన ఇద్దరు సైనికాధికారిణుల్లో ఒకరు సోఫియా ఖురేషీ. ఒక్కసారిగా వీరిద్దరూ వెలుగులోకి వచ్చారు. అలాంటి సోఫియాపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
సోఫియాను ఉగ్రవాదుల మతా(ముస్లి)నికి చెందిన వారిగా అభివర్ణించారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీశాయి. విజయ్ షాను తక్షణం మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. 
 
కాగా, మంత్రి విజయ్ షా మాట్లాడుతూ, వాళ్లు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిసేసి వితంతువుల్ని చేశారు. వాళ్ళ (ఉగ్రవాదులు) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోడీజీ పాకిస్థాన్‌కు పంపించ పాఠం నేర్పించారు' అంటూ కామెంట్స్ చేశారు. 
 
ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంగా మారాయి. ఆయన మంత్రి పదవిపై వెంటనే వేటు వేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటుగా, కించపరిచేవిగా ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్జే అన్నారు. మరోవైపు, మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధిష్టానం కూడా మంత్రిని పిలిచి చీవాట్లు పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments