Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగుడని ముందే చెప్పలేదు.. ఏడడుగులు వేసే లోపే కనిపెట్టేశారు..

పెళ్లికుమారుడు దివ్యాంగుడనే విషయాన్ని దాచిపెట్టారు. ఈ విషయం దండలు మార్చుకునే సమయంలోనే వధువు బంధువులు గుర్తించారు. వెంటనే దివ్యాంగుడితో వివాహం రద్దు చేసుకుని 18 గంటల్లోనే మరో సంబంధం వెతికి వధువుకు వివా

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (09:04 IST)
పెళ్లికుమారుడు దివ్యాంగుడనే విషయాన్ని దాచిపెట్టారు. ఈ విషయం దండలు మార్చుకునే సమయంలోనే వధువు బంధువులు గుర్తించారు. వెంటనే దివ్యాంగుడితో వివాహం రద్దు చేసుకుని 18 గంటల్లోనే మరో సంబంధం వెతికి వధువుకు వివాహం చేసిపెట్టారు.. ఆమె తరపు బంధువులు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌‌లోని గ్వాలియర్‌‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్‌లోని నింబాజీలోని ఖోహ్‌కు చెందిన కల్యాణ్ సింగ్ కుమార్తె పింకీకి నారాయణ విహార్‌లోని రైతు కుటుంబానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించారు. వరుడు బంధుసమేతంగా విడిదికి వచ్చాడు. అనంతరం వివాహ తంతులో భాగంగా వధూవరులు దండలు మార్చుకున్నారు. ఇక హోమగుండం చుట్టూ ఏడడుగులు వేయాల్సి ఉంది. ఇంతలో పింకీ తరపు బంధువులు వరుడ్ని దివ్యాంగుడిగా గుర్తించారు. దీంతో వివాహం జరగకూడదని పట్టుబట్టారు. 
 
వరుడు దివ్యాంగుడని ముందే ఎందుకు చెప్పలేదని వరుడు తరపు బంధువులను నిలదీశారు. జీవితాంతం తమ బిడ్డ కష్టాలపాలు కావడం ఇష్టం లేదని చెప్తూ.. పెళ్లిని రద్దు చేశారు. పోలీసుల జోక్యంతో పింకీ బంధువులు 18 గంటల్లోపే మరోక యువకుడ్ని చూసి ఆమెకు వివాహం జరిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments