Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేప్ చేస్తే ఉరే : బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇకపై కామాంధుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించనుంది. ఎవరైనా అత్యాచారానికి పాల్పడినట్టయిదే ఉరితీయనుంది.

రేప్ చేస్తే ఉరే : బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
, సోమవారం, 4 డిశెంబరు 2017 (17:57 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇకపై కామాంధుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించనుంది. ఎవరైనా అత్యాచారానికి పాల్పడినట్టయిదే ఉరితీయనుంది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభలో ఓ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.
 
ముఖ్యంగా, 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడే వారికి ఇకపై ఉరిశిక్ష విధించనున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. 
 
ఇటీవలే ఈ బిల్లుకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఓకే చెప్పగా తాజాగా బిల్లుకు ఆమోద ముద్ర పడింది. ఇక మిగిలింది రాష్ట్రపతి ఆమోదమే. అది కూడా పూర్తయితే.. అత్యాచార దోషులకు ఉరిశిక్ష విధిస్తారు. 
 
దోషులుగా తేలిన వారిని చనిపోయేంత వరకు ఉరితీయాలని బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే ఈ తరహా శిక్షను అమలు చేసే తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరిస్తుంది. 
 
కాగా, ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, అభంశుభం తెలియని పసిబిడ్డలపై కూడా కామాంధులు అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారు కఠిన వైఖరి అవలంభించాలని నిర్ణయించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తర కొరియాలో 'ఘోస్ట్‌ డిసీజ్‌'.. పారిపోతున్న సైనికులు