Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండెడు చాకిరి చేసి కడుపునిండా తిన్నాడనీ నగ్నంగా నిలబెట్టారు...

బండెడు చాకిరి చేసేవారు తిండి కూడా కడుపునిండా తింటారు. యజమాని కూడా అలా పని చేసేవాళ్ళకు ఇంకాస్త ఎక్కువగా వడ్డిస్తుంటారు. కానీ, ఆ యజమాని మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. దీంతో తన హోటల్‌లో పని చేసే వ్యక్తి

Webdunia
బుధవారం, 28 మార్చి 2018 (10:27 IST)
బండెడు చాకిరి చేసేవారు తిండి కూడా కడుపునిండా తింటారు. యజమాని కూడా అలా పని చేసేవాళ్ళకు ఇంకాస్త ఎక్కువగా వడ్డిస్తుంటారు. కానీ, ఆ యజమాని మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. దీంతో తన హోటల్‌లో పని చేసే వ్యక్తి కడుపునిండా ఆరగించాడని కోపంతో అతన్ని నగ్నంగా చేసి ఎండలో నిలబెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా కేంద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బేతుల్ జిల్లా కేంద్రంలోని ఒక దాబాలో ఓ వ్యక్తి పని చేస్తున్నాడు. బండెడు చాకిరి చేసే ఈ వ్యక్తి అన్నం కూడా ఎక్కువగానే ఆరగిస్తుంటాడు. ఇలా ఆహారం ఎక్కువగా తినడాన్ని గమనించిన యజమాని, అతని పార్టనర్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. 
 
అయినా కోపం చల్లారని వారు అతనిచేత బలవంతంగా బట్టలిప్పించి, నగ్నంగా నిలబెట్టారు. క్షమాపణలు చెబుతున్నా వినకుండా అతనిపై దాడికి దిగారు. దీనిపై దాబాకు వచ్చిన వారు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments