Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (08:44 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 85 యేళ్లు. ఈ విషయాన్ని టాండన్ కుమారుడు, యూపీ మంత్రి అశుతోష్ టాండన్ ధ్రువీకరించారు. 
 
శ్వాసకోశ సమస్యలు, జ్వరం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు తలెత్తడంతో గత నెల 11న లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. దీంతో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు కేంద్రం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. 
 
కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లాల్జీ పరిస్థితి రోజురోజుకు మరింత క్షీణించింది. ఆయన శరీరం చికిత్సకు సహకరించడం మానేసింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత దిగజారడంతో ఈ ఉదయం కన్నుమూసినట్టు మేదాంత ఆసుపత్రి డైరెక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు. 
 
గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అనుచరుడిగా భారతీయ జనతా పార్టీతో ఆయన రాజకీయ జీవితం పెనవేసుకుపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఆయనది ఘనమైన చరిత్ర. మాయావతి (సంకీర్ణ ప్రభుత్వం), కల్యాణ్ సింగ్ మంత్రివర్గాలలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments