Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి మూత్రం తాగించారు..

ప్రేమించడం పాపమైంది. ఇంకా వారు ప్రేమ పెళ్లి చేసుకోవడం అంతకంటే పాపం చేసినట్లైంది. ప్రేమించిన కారణంగా ఓ దంపతులకు నరకం చూపించారు. దంపతులిద్దరిని కిడ్నాప్ చేసి.. దారుణంగా చితకబాది.. ఆ తర్వాత గుండు గీయించి

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (12:35 IST)
ప్రేమించడం పాపమైంది. ఇంకా వారు ప్రేమ పెళ్లి చేసుకోవడం అంతకంటే పాపం చేసినట్లైంది. ప్రేమించిన కారణంగా ఓ దంపతులకు నరకం చూపించారు. దంపతులిద్దరిని కిడ్నాప్ చేసి.. దారుణంగా చితకబాది.. ఆ తర్వాత గుండు గీయించి.. మూత్రం తాగించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లాలోని హర్‌దాస్‌పూర్‌లో జులై 25న చోటుచేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. హర్‌దాస్‌పూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు, 21 ఏళ్ల యువతి గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఈ ఏడాది మే నెలలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు నెలల పాటు గుజరాత్‌లో ఉన్న ఈ నవ దంపతుల ఇంటికి యువకుడి మేనమామ వచ్చాడు. 
 
ఆ విషయం తెలుసుకున్న వధువు తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని దంపతులను జులై 25న కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నవదంపతులను తీవ్రంగా కొట్టి.. గుండు గీయించారు. అందరూ చూస్తుండగానే వీరిద్దరికి మూత్రం తాగించారు. అయితే ఈ దృశ్యాన్ని కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి.. వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. 
 
ఇక ధైర్యం చేసుకున్న బాధితులైన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు తన భార్య కుటుంబానికి రూ. 70 వేలు, రెండు మేకలను శిక్ష కింద ఇచ్చామని వరుడు చెప్పాడు. అయినా వేధింపులు కొనసాగుతూనే వున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ సినిమా కోసం రెక్కీ చేస్తున్న దర్శకుడు అట్లీ

4 రోజుల్లో 15.41 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న లిటిల్ హార్ట్స్

Siddhu: సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా తెలుసు కదా విడుదల తేదీ ఫిక్స్

గత ఏడాది డిసప్పాయింట్ చేసింది, విఎఫ్ఎక్స్ ఇన్ హౌస్ లో చేయడంతో కంట్రోల్ వుంది : టిజి విశ్వప్రసాద్

Roshan: రోషన్ ఛాంపియన్‌లో మలయాళ నటి అనస్వర రాజన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments