Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూట్యూబ్ వీడియో చూసి ఇంట్లోనే ప్రసవం చేశారు.. అధిక రక్తస్రావంతో?

సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుతం చాలామందిపై వుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే చాలామందికి నిద్రపట్టట్లేదు. అలాగే యూట్యూబ్ వీడియోలు చూసి జనాలు చాలానే నేర్చుకుంటారు. అయితే యూట్యూబ్ వీడియోలను చూసి.. వాటిలో

యూట్యూబ్ వీడియో చూసి ఇంట్లోనే ప్రసవం చేశారు.. అధిక రక్తస్రావంతో?
, గురువారం, 26 జులై 2018 (11:50 IST)
సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుతం చాలామందిపై వుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే చాలామందికి నిద్రపట్టట్లేదు. అలాగే యూట్యూబ్ వీడియోలు చూసి జనాలు చాలానే నేర్చుకుంటారు. అయితే యూట్యూబ్ వీడియోలను చూసి.. వాటిలోని సూచనలు పాటించి ఇంట్లోనే బిడ్డకు జన్మనివ్వాలన్న ఆ దంపతుల వింత ఆలోచనతో నిండు ప్రాణం పోయింది.


పురిటి నొప్పులతో బాధపడుతూ.. ప్రసవ వేదన అనుభవించిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందింది. తమిళనాడులోని తిరుపూర్‌లో ఈ విషాదం జరిగింది. జూలై 22న జరిగిన ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. తిరుపూర్‌లోని రత్నగిరీశ్వరనగర్‌కు చెందిన కృతిక(28) ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. కృతిక భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఇంతకు ముందే మూడు సంవత్సరాల వయసున్న పాప ఉంది. ఈ దంపతులిద్దరూ ఇంటిలోనే యూట్యూబ్ వీడియోలను ఫాలో అవుతూ బిడ్డకు జన్మనివ్వాలని ముందే నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
 
యూట్యూబ్‌లో డెలివరీ సమయంలో ప్రెగెంట్ లేడీకి ఎలా సాయం అందించాలనే అంశానికి సంబంధించి పలు వీడియోలను చూశారు. అనుకున్నట్టే చేశారు. కానీ ప్రయోగం వికటించి.. ఒక నిండు ప్రాణం పోయింది. పురిటి నొప్పులు 2గంటలకు మొదలైతే ఆమెను 3.30కు ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారని.. అప్పటికే ఆమె బిడ్డకు జన్మనిచ్చి.. మరణించిందని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మెరుగైన వైద్య సేవలున్న ఈ కాలంలో ఈ ప్రయోగాలేంటని వైద్యులు మండిపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌ నీకే అంతుంటే... వాళ్లను వివాదంలోకి లాక్కండి: పవన్ కల్యాణ్