Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా కూటమి ప్రధాని అభ్యర్థి రాహుల్ : ఎంకే స్టాలిన్ ప్రకటన

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (09:46 IST)
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని డీఎంకే అధినేత ఎంకే.స్టాలిన్ ప్రకటించారు. అదివారం రాత్రి డీఎంకే అధ్యక్షుడు దివంగత ఎం.కరుణానిధి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, మాజీ అధ్యక్షురాలు సోనియా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేరళ సీఎం పినరయి విజయన్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామితో పాటు.. మరికొంతమంది సీనియర్ నేతలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా స్టాలిన్ ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిని ఓడించడానికి రాహుల్‌ గాంధీని తదుపరి ప్రధానమంత్రిగా ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఇందిరా గాంధీ, సోనియా గాంధీలను తన తండ్రి కరుణానిధి ఇదే రీతిలో ప్రధానులుగా ప్రతిపాదించిన విషయాన్ని గుర్తుచేశారు. 'రాహుల్‌గాంధీ రావాలి... సుపరిపాలన ఇవ్వాలి' అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments