Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరితిత్తులు లేని జీవి..!

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (03:53 IST)
శరీర ముఖ్య భాగాల్లో ఊపిరితిత్తులు ఒకటి. కానీ అవి లేని జీవి ఏంటో తెలుసా? దాని పేరు కాసిలిటా ఇవోక్రమా. దీన్ని గయానా దేశంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి ఊపిరితిత్తులే కాదు.. కాళ్లు, నాసికా రంధ్రాలు కూడా లేవు.

చూడటానికి వానపాములా కనిపిస్తుంది. నీటిలో శ్వాసించే లార్వాగా జీవనం ప్రారంభిస్తుంది. నేలపై కూడా శ్వాసించేలా శరీరాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. కొన్ని అవయవాలు లేకుండా పుట్టిన ఈ జీవి కాసిలియన్‌ జాతికి చెందినది.

ప్రపంచం మొత్తంమీద 120 కాసిలియన్‌ జాతులు ఉంటే వీటిలో ఊపిరితిత్తుల్లేనిది ఇదొక్కటే. మరి ఊపిరిత్తులు, ముక్కు రంధ్రాలు లేకుండా ఇదెలా శ్వాస తీసుకుంటోంది? వీటి చర్మంపైన కంటికి కనిపించనంత సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా వాతావరణంలోని ఆక్సిజన్‌ను ఇవి పీల్చుకుంటాయి.

అంటే చర్మం ద్వారా శ్వాస తీసుకుంటుందన్న మాట. వీటి కంటిచూపు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. నేలపైన 11 సెం.మీ. పొడవు మాత్రమే పెరిగే ఇది, నీటిలో రెండడుగుల వరకు ఎదుగుతుంది.

కర్ణాటకలోని బెల్గాంలో కూడా ఈ జాతికి చెందిన జీవులు ఈ మధ్యనే బయటపడ్డాయి. ఇలా కొన్ని రకాల జీవులకు ఎందుకు శరీరభాగాలు ఉండవో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments